తిరుమల: తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో, చనిపోయిన భక్తుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం బోర్డు సూత్రప్రాయంగా ఆమోదించింది.
వైకుంఠ ద్వార దర్శనాల వ్యవధిపై మీడియా ప్రశ్నలకు స్పందించిన నాయుడు, ఈసారి 10 రోజుల దర్శనాల ప్రణాళిక అమలవుతుందని స్పష్టం చేశారు.
భవిష్యత్ కోసం నిపుణుల అభిప్రాయాల ఆధారంగా సమగ్ర సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన క్షమాపణ వ్యాఖ్యలపై నాయుడు మాట్లాడుతూ, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.
క్షమాపణలు చెప్పడం సరైనదేనని, కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు అన్నారు. భవిష్యత్‌లో అలాంటి తప్పులు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.