తిరుమల: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించిన అనంతరం టీటీడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ముందు అందరూ సమానమేనని, అలాంటి సంస్థ వివక్షతో వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికే ఎక్కువ లబ్ధి చేకూరిందని, తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో అందించిన సౌకర్యాలను ఇప్పుడు ఉపేక్షించడం దారుణమని వ్యాఖ్యానించారు.
టీటీడీ ఛైర్మన్‌కు స్వతంత్ర నిర్ణయాలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు.
ఈ వివక్ష రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలకు తెలంగాణలో ఇబ్బందులను తలపెట్టే అవకాశం ఉందని హెచ్చరించిన గౌడ్, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల గుర్తింపును నిలబెట్టడం టీటీడీ బాధ్యత అని పలువురు తెలంగాణ నేతలు కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.