ఏప్రిల్ మొదటి సగం ముగిసినా టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమాకూడా సక్సెస్ అందుకోలేదు. గత వారం విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఏప్రిల్‌లో మొదటి విజేత ఎవరు అనే ఆసక్తికర రేస్ స్టార్ట్ అయ్యింది.
ఈ వారంలో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తమన్నా లీడ్ రోల్‌లో వస్తున్న ఓదెల 2 మూవీ మైథలాజికల్ హారర్ జోనర్‌తో ఏప్రిల్ 18న విడుదల కానుంది. అశోక్ తేజ దర్శకత్వంలో, సంపత్ నంది రచనతో వస్తున్న ఈ సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్. దీనిపై మంచి బజ్ నెలకొంది.
అదే రోజున నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా విడుదల కానుంది. పోలీస్–మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్లతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందన్న విశ్వాసం ఉంది. ఇక మాస్ మహారాజా రవితేజ హిట్ మూవీ నా ఆటోగ్రాఫ్ ఏప్రిల్ 18న రీ రిలీజ్ కాబోతుంది.
ఎమోషనల్ కథ, కీరవాణి సంగీతంతో వచ్చిన ఈ మూవీకి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏది బోణీ కొడుతుందో వేచి చూడాలి. ఏప్రిల్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు జోష్ తీసుకురావాల్సిన సమయం ఇదే.