fbpx
Saturday, October 26, 2024
HomeMovie Newsటాలీవుడ్ బాక్సాఫీస్.. నానిపైనే ఆశలు

టాలీవుడ్ బాక్సాఫీస్.. నానిపైనే ఆశలు

TOLLYWOOD-BOXOFFICE-WAITING-FOR-NANI-MOVIE
TOLLYWOOD-BOXOFFICE-WAITING-FOR-NANI-MOVIE

మూవీడెస్క్: రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మరియు మాస్ మహారాజ్ రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ విడుదలయ్యాయి.

అయితే, వీటికి మొదటి రోజే ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాలేవు. ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ రావడంతో, ఈ సినిమాల రిజల్ట్ పై ఇంకా సస్పెన్స్ నెలకొంది.

ఇదే సమయంలో, చిన్న చిత్రంగా వచ్చిన నార్నె నితిన్ ‘ఆయ్’ సినిమా, మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు క్రమంగా బాక్సాఫీస్‌ వసూళ్లలో పెరుగుతోంది.

మరోవైపు, చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కించుకుంటోంది.

విక్రమ్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం‘పై ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ బజ్‌ రావడంతో, భారీ ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

‘దసరా’ మూవీ తర్వాత నాని మరోసారి 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతాడనే ఆశలు నెలకొన్నాయి.

కేవలం మంచి కథతోనే కాకుండా, సరిపోదా శనివారం సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, నాని కెరీర్‌లో మరో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీ అవ్వడం ఖాయం. ఇక ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular