2020 సంవత్సరం రైమింగ్ బానే ఉంది కానీ ఈ సంవత్సరం టైమింగే బాలేదు. సినిమా మాత్రమే కాదు ఏ రాంగానికీ ఈ సంవత్సరం కలిసిరాలేదు. టాలీవుడ్ విషయానికి వస్తే ఈ సంవత్సరం తెలుగు సినిమాల ఆరంభం బానే ఉంది. సంక్రాతి కి విడుదల అయిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రకారం బాగానే ఆడాయి. రజిని కాంత్ ‘దర్బార్’ కూడా పర్వాలేదనిపించింది. కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ , రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ , నాగ శౌర్య నటించిన ‘అశ్వద్ధామ’ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకోలేక పోయాయి. కన్నడ డబ్ గా విడుదల అయిన ‘అతనే శ్రీమన్నారాయణ‘ విమర్శకుల ప్రశంసలు పొందినా కూడా ప్రమోషన్, తెలిసిన స్టారింగ్ లేకపోవడం వలన బాక్స్ ఆఫీస్ డాగర కుదేలైంది.
సంక్రాంతి సీజన్ తర్వాత ఏ సినిమా గొప్పగా ఆడలేదు. శర్వానంద్ ‘జాను’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ దారుణంగా డిసాస్టర్ అయ్యాయి. సరిగ్గా కరోనా సంక్షోభం ముందు నితిన్ ‘భీష్మ’ సినిమా తో హిట్ కొట్టాడు. వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకొని కలెక్షన్స్ పరంగా, టాక్ పరంగా హిట్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ కూడా మంచి టాక్ తో దూసుకెళ్తున్న సమయం లో కరోనా తాకిడికి థియేటర్స్ అన్ని మూసివేయడం తో బాక్సాఫీస్ కూడా లొక్డౌన్ లో ఉండిపోయింది. ఇవే కాకుండా ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
మొత్తం గా చూసుకుంటే 2020 సంవత్సరం లో 6 నెలల్లో కేవలం 3 సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలదొక్కుకున్నాయి.