మూవీడెస్క్: బాలకృష్ణ కు ఘన సన్మానం! టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఈ పురస్కారం ఆయనకు సినీ ఇండస్ట్రీలో సేవల ప్రతిఫలంగా అందగా, అభిమానులు దీనిని ఘనంగా జరుపుకుంటున్నారు.
50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఈ మహానటుడికి ఈ గౌరవం రావడం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
తమ అభిమాన హీరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకోవడం పట్ల సోషల్ మీడియాలో వేడుకలు జరుపుకున్నారు.
ఇక బాలయ్యను సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా అభినందించారు.
పలువురు సెలబ్రిటీలు బాలయ్య ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందించి, తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తరఫున బాలయ్యకు ఘన సన్మానం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ వేడుకకు సంబంధించి తేదీ, వేదికను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరవుతారని తెలుస్తోంది.
తాతమ్మ కలతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ, తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకున్నారు.
తాజాగా డాకు మహారాజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు అఖండ-2 కోసం సిద్ధమవుతున్నారు.
పద్మభూషణ్ అవార్డుతో ఆయన సత్తాను మరోసారి నిరూపించుకున్న ఈ ఘనత టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పాలి.