వేసవి వచ్చేసింది.. థియేటర్ల హీట్ పెరగబోతోంది! 2025 సమ్మర్ టాలీవుడ్‌కి హంగామా పక్కా. మిడ్ రేంజ్ సినిమాలు ఎక్కువగా పోటీకి దిగుతున్నాయి. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజా సాబ్ వాయిదా పడటంతో, కొత్త సినిమాలకు మార్గం సుగమమైంది. మార్చి 14న కిరణ్ అబ్బవరం దిల్ రూబా, ప్రియదర్శి కోర్ట్ రిలీజ్ కానున్నాయి.
మార్చి 28న నితిన్ రాబిన్‌హుడ్, విక్రమ్ వీర ధీర శూరన్ 2, మలయాళ బిగ్ మూవీ ఎల్ 2: ఎంపురాన్ విడుదలవుతున్నాయి. ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ బరిలోకి దిగబోతున్నాయి. ఏప్రిల్ 25న మంచు విష్ణు కన్నప్ప భారీ అంచనాలతో రానుంది.
మే 1న నాని హిట్ 3, సూర్య రెట్రో రిలీజ్ కానుండగా, మే 9న పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సందడి చేయనుంది. అదే రోజు నితిన్ తమ్ముడు కూడా ప్లాన్ చేసుకున్నాడు.
మే 21న మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ రాబోతుండగా, మే 30న విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ భారీ హైప్‌తో థియేటర్లలోకి రానుంది. ఈసారి బాక్సాఫీస్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.