టాలీవుడ్: గత తొమ్మిది నెలలుగా థియేటర్లు మూతపడి ఉండడం తో ఇన్నాళ్లు సినిమాలేవీ విడుదల అవలేదు. దాదాపు నెల రోజులుగా థియేటర్లు తెరుచుకున్నాయి. థియేటర్లు తెరచినా కూడా అంతగా ఆకట్టుకునే సినిమాలేవీ విడుదలవలేదు. రేపు క్రిస్టమస్ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా థియేటర్ లలో విడుదల అవుతుంది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత కొంచెం గుర్తింపు ఉన్న సినిమా అని కానీ లేదా థియేటర్ లకి జనాలని రప్పించే సినిమా అని కానీ ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమా భవితవ్యం పైన తొందర్లో విడుదల అవ్వాల్సిన సినిమాల సంగతి ఏంటి అనేది ఆధారపడి ఉంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకోసం టాలీవుడ్ మొత్తం అండగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం బెస్ట్ విషెస్ తెలియచేస్తూ సినిమాని థియేటర్లలో ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. ఈ సినిమా థియేటర్ లలో మంచిగా ఆడితే తర్వాత రాబోయే సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. ఈ సినిమా భవితవ్యం పైన 2021 థియేటర్ రెలీసెస్ అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటివరకు మంచిగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేసాడు. ఈ సినిమాకి లభించే ఆదరణ పైన ఇండస్ట్రీ మనుగడ ఆధారపడి ఉందన్నాడు. అన్ని సేఫ్టీ జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ ధరించి సినిమాని ఆస్వాదించండి అని ట్వీట్ చేసారు. ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీ నుండి రక రకాల ప్రముఖులు అందరూ సాయి ధరమ్ తేజ్ సినిమాకి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ సపోర్ట్ గా నిల్చున్నారు.