టాలీవుడ్: దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంగానే టాలీవుడ్ లో ఉంటూ టాప్ హీరోయిన్లుగా ఉన్న కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా, శృతి హాసన్ ప్రస్తుతం ఓటీటీల్లో వెబ్ సిరీస్ లతో పలకరించనున్నారు. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ‘లైవ్ టెలికాస్ట్’ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ లో కాజల్ మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో నటిస్తుంది. ఒక ఇంటిలో దయ్యం ఉంటె ఎలా ఉంటుంది అనే ఫేక్ రియాలిటీ షో ప్లాన్ చేస్తే నిజంగానే ఆ సెట్ లోకి దయ్యం వస్తుంది. ఇదంతా లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది ఈ సిరీస్ లో చూపించనున్నారు. ఫిబ్రవరి 12 నుండి ఈ సిరీస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవనుంది.
అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ మాన్ సీజన్ 1 బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం సీజన్ 2 రూపొందించి విడుదలకి సిద్ధం చేసారు. ఈ సీజన్ లో విలన్గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించింది. తమన్నా కూడా ఆహా వారు రూపొందించిన థ్రిల్లర్ ’11th హౌర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ ఫ్లిక్ లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్’ ని తెలుగులో ‘పిట్ట కథలు’ అనే పేరుతో రూపొందించారు. ఈ సిరీస్ లో ఒక పాత్రలో శృతి హాసన్ నటించింది. ఈ సిరీస్ కొద్ది రోజుల్లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోయిన్లు అందరూ దాదాపు ఒకేసారి ఓటీటీ ల్లో కనిపించనున్నారు.