టాలీవుడ్: తెలుగు సినిమాల్లో ఒకప్పుడు నిర్మాత అంటే అగ్ర తాంబూలం ఉండేది. పాత రోజుల్లో నిర్మాత వచ్చాడంటే అందరూ కింద కూర్చొని నిర్మాతని కూర్చి పైన కూర్చోపెట్టే వాళ్ళు అన్నట్టు ఇంటర్వూస్ లో చూసాం. అంటే భయం అని కాకుండా గౌరవం అన్నట్టుగా చెప్పేవాళ్ళు. పోను పోను పరిస్థితులు మారిపోయాయి. ఇపుడు ఐతే కొందరు నిర్మాతల పరిస్థితి కేవలం డబ్బులు సప్లై చేసే వాళ్ళ లాగా తయారయింది. దీనితో పాటు ఇండస్ట్రీ మొత్తం హీరో సెంట్రిక్ అవడం తో హీరో ఎంత చెప్తే అంత, ఏం చెప్తే అది అన్నట్టు తయారయింది. మొదట్లో ఏరియా రైట్స్ అని లేదా లాభాల్లో వాటా అని మొదలైన విషయం ఇపుడు ప్రతీ పెద్ద హీరో సినిమాల్లో సొంత ప్రొడక్షన్ హౌస్ వాటా కి చేరింది.
అంతర్గతంగా డీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియవు కానీ దాదాపు ప్రతి పెద్ద హీరో సినిమాకి సొంత ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ కనిపిస్తుంది. అదే బ్యానర్ లో చిన్న హీరోలతో చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు అది వేరే విషయం. మహేష్ బాబు హీరోగా రూపొందే ప్రతి సినిమాలో దాదాపు ‘GMB ఎంటర్టైన్మెంట్’ బాగా స్వామ్యం కనిపిస్తుంది. ఈ మధ్య ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాల్లో సోదరుడు కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ కనిపిస్తుంది. చిరంజీవి నటించే సినిమాలకి కొణిదెల ప్రొడక్షన్స్ కనిపిస్తుంది. ఇలా దాదాపు ప్రతి పెద్ద హీరో సినిమాలో సొంత ప్రొడక్షన్ బ్యానర్ కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో మున్ముందు రోజుల్లో నిర్మాత మనుగడ ఎలా ఉండబోతుందో అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.