టాలీవుడ్: గత రెండు వారాలుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ లోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈ వరదల వల్ల చాలా ప్రభావితం అయింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు నామ రూపాలు లేకుండా అయ్యాయి. వరద బాధితుల్ని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అందులో వ్యాపారులు, వేరే రాష్ట్ర ప్రభుత్వాలు, సినిమా పెద్దలు ఇలా చాలా మంది ఉన్నారు. తమ వంతుగా టాలీవుడ్ హీరోలు కూడా సి ఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
నందమూరి బాలకృష్ణ తన వంతుగా రూ. కోటీ యాభై లక్షలు, పవన్ కళ్యాణ్ రూ. కోటి , ప్రభాస్ రూ. కోటి, చిరంజీవి రూ. కోటి, మహేష్ బాబు రూ. కోటి, జూనియర్ ఎన్టీఆర్ రూ. యాభై లక్షలు, అక్కినేని నాగార్జున రూ. యాభై లక్షలు, రామ్ పోతినేని రూ. యాభై లక్షలు, త్రివిక్రమ్ రూ. పది లక్షలు, విజయ్ దేవరకొండ రూ. పది లక్షలు, రవి తేజ రూ. 10 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ. 10 లక్షలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు హరీష్ శంకర్ తమ వంతుగా చెరో 5 లక్షలు విరాళాలు ప్రకటించారు.