టాలీవుడ్: ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక చిన్న నటుడు, జీవన్ కుమార్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ విశ్వక్సేన్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో విశ్వక్ తో ‘నాగుల పంచమి రోజు కూడా సెలవిస్తరారా మీ కంపెనీ ల’ అనే డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ అంటే గుర్తు పడతారు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తన వారికి నాచురల్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఇతను చిన్న ఆర్టిస్ట్ కావచ్చు కానీ మనసు మాత్రం పెద్దది. కరోనా సమయం లో ఎంతో కష్టపడుతూ కష్టాల్లో ఉన్న వాళ్లకి నిత్యావసర వస్తువులు, దూర ప్రాంతాలకి కరోనా కిట్లు అందిస్తూ తన సేవా హృదయాన్ని చాటుకుంటున్నాడు.
మా అసోసియేషన్ కి, డైరెక్టర్ అసోసియేషన్ కి నిత్యావసర సరుకుల ప్యాకెట్లు అందచేశారు. తోటి నటి పావలా శ్యామల కష్టాల్లో ఉంటె ఆమెకి తోచిన సాయం చేసాడు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని మారు మూల ప్రాంతాలకి నిత్యావసరాలని సమకూర్చడమే కాకుండా తానే స్వంతంగా ఆటోల్లో లోడ్ కూడా చేసాడు. నిర్మల్ జిల్లా లోని కొన్ని తాండాలకి నిత్యావసర వస్తువులని సమకూర్చాడు. కొత్తగూడెం లోని తాండాలకి 10000 కేజీ ల బియ్యాన్ని అందచేసాడు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ సిటీ లోని పోలీస్ చెక్ పోస్ట్ లకి వాటర్ బాటిల్స్ సప్లై చేసాడు. ప్రముఖ సినీ జర్నలిస్ట్ టిఎన్ఆర్ గారు మృతి చెందినపుడు వారి కుటుంబానికి కొంత సహాయం చేసాడు. ఇలా కరోనా సమయంలో తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నాడు. చాలా సార్లు తానే స్వయంగా వెళ్లి సహాయం అందవలసిన వారికి సహాయం చేకూరేలా చూసుకున్నాడు. చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ పెద్ద మనసు అని నిరూపించుకున్నాడు. మున్ముందు ఆర్టిస్ట్ గా ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి భవిష్యత్తుతో దూసుకెళ్లాలని ఆశిద్దాం.