హైదరాబాద్: కరోనా వల్ల అయిదు నెలల నుండి హీరోలు అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. షూటింగ్స్ చేసుకోవచ్చు అని అనుమతులు లభించినా కూడా ఇంతవరకు పెద్దగా షూటింగులు అయితే మొదలు కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా ఒక్కో హీరో షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనల్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు షూటింగ్స్ మొదలు పెడుతున్నారు.
మొన్ననే పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించారు ప్రశాంత్ నీల్ మరియు యష్ బృందం. ఇపుడు నాగార్జున కూడా ఈ నెల నుండి బిగ్ బాస్ షూటింగ్ తో పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. వీళ్ళ దారి లోనే యువ అక్కినేని హీరో నాగ చైతన్య కూడా తన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభించబోతున్నాడు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా రాధే శ్యామ్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో రూపొందిస్తున్న సెట్ లో నటించబోతున్నాడు అనే టాక్ నడుస్తుంది. ఇన్నాల్లూ వేచి చూసిన హీరోలు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు షూటింగులు స్టార్ట్ చేయడం మంచి పరిణామం. కాకపోతే తక్కువ మందితో చేసే షూట్ లకే ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువగా ఉండే సీన్స్ కి ఈ పరిస్థితుల్లో అవకాశం ఉండదు. వీళ్ళ దారిలోనే చిరంజీవి ఆచార్య, నాని టాక్ జగదీశ్, ఎస్ ఎస్ రాజమౌళి క్రేజీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కూడా షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాయి.