టాలీవుడ్: ఈ సంవత్సరాన్ని కరోనా నామ సంవత్సరంగా సంబోదించవచ్చు. కరోనా కారణంగా దాదాపు అన్ని ఇండస్ట్రీ లు అతలాకుతలం అయ్యాయి. కొన్ని కోట్లు జరిగే బిజినెస్ ఆగిపోయింది. సినిమా ఇండస్ట్రీ కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు. మర్చి మూడవ వారంలో మూతపడిన థియేటర్లు డిసెంబర్ లో తెరుచుకున్నాయి. కరోనా కారణంగా షూటింగ్లు కూడా ఆరు నెలలు ఆగిపోయాయి.
ఈ సంవత్సరం విడుదలైన సినిమాలు చూసుకుంటే సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురం లో’, ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలు సూపర్ హిట్స్ అఫ్ ది ఇయర్ గా నిలిచాయి. ఆ తర్వాత నితిన్ ‘భీష్మ’ , విశ్వక్సేన్ ‘హిట్’ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక రవితేజ ‘డిస్కో రాజా’, కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు డిస్టర్లుగా మిగిలాయి. ఇక కరోనా తర్వాత డిసెంబర్ లో థియేటర్లు తెరుచుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా మంచి టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఒక రకంగా మున్ముందు విడుదల అవబోయే సినిమాలకి ఈ సినిమా మార్గదర్శకంగా నిలిచింది.
పైన చెప్పుకున్నదంతా థియేటర్లలో విడుదలైన సినిమాల టాక్, ఇవే కాకుండా కరోనా టైం లో చాలా సినిమాలు ఓటీటీ ల్లో విడుదల అయ్యాయి. ఓటీటీల్లో విడుదల అయిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, సుహాస్ ‘కలర్ ఫోటో’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ మూడు సినిమాలు ఓటీటీ ల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంకా చాలా విడుదల అయ్యాయి కనుమరుగు అయ్యాయి, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ మరియు ‘మిస్ ఇండియా’. ఈ రెండు సినిమాలు కీర్తి సురేష్ కి డిజాస్టర్స్ గా నిలిచాయి.
ఇవే కాకుండా ఈ సంవత్సరం ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖుల్ని కోల్పోయింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం. ఈయన్ని ఆరాదించని వాళ్ళు ఉండరు, ఈయన గొంతు వినకుండా నిద్రపోని రోజు ఉండదు.. అలాంటి వ్యక్తి కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
మొత్తంగా చెప్పాలంటే 2020 కొంత వరకే హ్యాపీ మిగతా అంతా బాధాకరంగా వుంది అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి సంవత్సరం మున్ముందు ఎప్పుడు రాకూడదనే ఆశిద్దాం.