ఒల్డ్ మూవీస్‌ని మళ్లీ థియేటర్‌కు తీసుకెళ్లే ట్రెండ్‌కి ఇప్పుడు స్పీడ్ వచ్చింది. ఫ్యాన్స్‌లో నోస్టాల్జియా, 4K రీస్టోరేషన్ టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రమోషన్‌తో కలిపి రీ రిలీజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు – వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) రీ రిలీజ్ కూడా అదే రేంజ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఫ్యామిలీ ఎమోషన్‌తో నడిచిన SVSC ఇప్పుడు 4K రీస్టోరేషన్‌తో మళ్లీ థియేటర్లలో ఆడింది. ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, థియేటర్ల హౌస్‌ఫుల్ స్టేటస్ చూస్తే, మల్టీస్టారర్ మాజిక్ ఇప్పటికీ వర్కౌట్ అవుతుందన్న స్పష్టత వచ్చింది. ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా రూ.6.60 కోట్లు గ్రాస్ వసూలు చేసి, టాప్ 5 రీ రిలీజ్ మూవీస్‌లో స్థానం సంపాదించింది.
ఇక మొత్తం రీసెంట్ టాప్ రీ రిలీజ్ సినిమాల లిస్ట్ చూస్తే:
ఘిల్లి 4K (తమిళం) – ₹32.50 కోట్లు
మురారి 4K – ₹8.90 కోట్లు
గబ్బర్ సింగ్ 4K – ₹8.01 కోట్లు
ఖుషి – ₹7.46 కోట్లు
SVSC 4K – ₹6.60 కోట్లు
వాటితో పాటు బిజినెస్ మాన్, దేవదూతన్, స్పడికం, ఆరెంజ్, సింహాద్రి వంటి చిత్రాలు కూడా టాప్ 10లో నిలిచాయి. ఈ ట్రెండ్ ప్రొడ్యూసర్లకు ప్రోత్సాహాన్నిచ్చింది. 4K రీస్టోరేషన్, థియేట్రికల్ మిక్స్‌తో కలిపి నాటి సినిమాల్ని కొత్త తరం ప్రేక్షకులకు పరిచయం చేయడం, ఫ్యాన్స్‌ని మళ్లీ కలిపే ప్రయత్నంగా మారుతోంది.
మొత్తానికి రీ రిలీజ్‌లు కూడా బాక్సాఫీస్‌పై ప్రభావం చూపే ట్రెండ్‌గా మారాయి. మరి రాబోయే రోజుల్లో ఏ క్లాసిక్ సినిమా కొత్తగా థియేటర్లలో హంగామా చేస్తుందో చూడాలి.