మాలీవుడ్: టావినో థామస్ హీరోగా రూపొందుతున్న ‘మెరుపు మురళి’ అనే సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. లోకల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. టీజర్ చూస్తే ఒక పీరియాడిక్ సినిమాలాగే అనిపిస్తుంది. అలాగే టీజర్ లో చూపించిన కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. టావినో థామస్ ఇచ్చిన చిన్న చిన్న ఎక్సప్రెసిషన్స్ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. టీజర్ లో చూపించినంత వారికి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో డబ్బింగ్ సినిమాల ద్వారా ఆకట్టుకున్న ఈ హీరో ఇపుడు ఈ సినిమాని 5 భాషల్లో విడుదల చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని చూస్తున్నాడు.
బేసిల్ జోసఫ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘మిన్నల్ మురళి’. ఈ సినిమాని మళయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చెయ్యబోతున్నారు. తెలుగులో ‘మెరుపు మురళి’ అని తమిళ్ లో ‘మిన్నల్ మురళి’ అని, కన్నడ లో ”మించు మురళి” అని హిందీ లో ‘మిస్టర్ మురళి ‘ అని టైటిల్స్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఓనం పండుగ సందర్భంగా ఇవాళ అన్ని భాషల్లో విడుదల చేసారు.