మూవీడెస్క్: ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా గుర్తింపు పొందిన యష్, ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ చిత్రంపై శ్రద్ధ పెట్టారు.
ఈ మాఫియా బ్యాక్‌డ్రాప్ కథాపరంగా మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
తాజాగా యష్ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ పంచుకున్నారు.
జనవరి 8న ఉదయం 10:25కు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానుందని పోస్టర్‌తో వెల్లడించారు.
అందులో యష్ క్యాప్ ధరించి, ఓ పాత నాటు కారుతో సిగార్ తాగుతూ కనిపించారు.
ఈ లుక్ చూసి ఫ్యాన్స్ కేజీఎఫ్ స్టైల్ పునరావృతం అవుతుందని అంచనా వేస్తున్నారు.
అభిమానులు టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ వస్తుందని ఆశపడుతున్నారు.
యష్ హ్యూమా ఖురేషి, కియారా అద్వానీతో కలిసి నటించగా, ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానమని టాక్.
‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నుంచి ఇది తొలి చిత్రం కావడం విశేషం.