విజయవాడ/విశాఖపట్నం: రెండు నెలల లొక్డౌన్ తరువాత, ఆంధ్రప్రదేశ్లో సోమవారం రైలు సర్వీసులు పాక్షికంగా తిరిగి ప్రారంభమయ్యాయి. ఓ పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు సికింద్రాబాద్ బయలుదేరనున్న గోదావరి ఎక్సప్రెస్ లో ఎక్కడానికి సమయానికంటే ముందే చేరుకోగా మరోపక్క విజయవాడ రైల్వే స్టేషన్‌లో సామాజిక దూరం సవాలుగా మారింది.
ఇంటర్-స్టేట్ సర్వీసెస్ పునరుద్ధరించబడిన తరువాత విజయవాడ నుండి బయలుదేరిన మొట్టమొదటి రైలు, సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్. రైలు బయలుదేరడానికి 90 నిమిషాల ముందు స్టేషన్ కు చేరుకోమని సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్.సి.ఆర్) ప్రయాణికులకు సూచించినప్పటికీ, ప్రజలు ఈస్ట్ టెర్మినల్ ఎంట్రీ పాయింట్ వద్ద తెల్లవారుజామున 4.30 నుండి గుమిగూడారు.
రైలు నంబర్ 07201 ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యే గుంటూరు స్టేషన్ నుండి 10 నిమిషాల హాల్ట్ తరువాత బయలుదేరింది.
విజయవాడలో ప్రయాణీకులు మాస్కులు ధరించినప్పటికీ, స్టేషన్‌లోకి ప్రవేశించే హడావిడి కారణంగా సామాజిక దూర నిబంధనలు కొండెక్కిపోయాయి. రిజర్వు చేసిన టిక్కెట్లు ఉన్నవారు మాత్రమే క్యూలలో నిలబడగలరని, మిగిలిన వారు అనుమతించబడరు అని అధికారులు పదేపదే ప్రకటించారు. చాలామంది సూచనలను పెడచెవిన పెట్టేసరికి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి శారీరక దూరాన్ని పాటిస్తూ ప్రయాణీకులను ఒక లైన్ లో నిలబడేలా చేసింది.
మరోవైపు, విశాఖపట్నం అధికారులు ప్రయాణీకులందరూ సామాజిక దూరాన్ని పాటించేలా చూస్తూ, ప్రయాణీకులు మాస్కులు, చేతి తొడుగులు ధరించాలని మరియు రాత్రిపూట ప్రయాణానికి తమ సొంత దుప్పట్లను తీసుకెళ్లాలని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం ప్రకటించారు. రిజర్వు టిక్కెట్లు ఉన్నవారు మాత్రమే ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చని రైల్వే అధికారులు ఆదేశించారు మరియు ఇతరులను తిరిగి వెళ్ళమని కోరారు. ఇంట్రా-స్టేట్ ప్రయాణానికి ఆంక్షలు ఉండడంతో, విజయవాడ రాజమహేంద్రవరం వెళ్లే కొద్దిమంది నిరాశ చెందారు.
శారీరక దూరాన్ని నిష్టగా అమలుపరిచేందుకు, విజయవాడలోని రైల్వే సిబ్బంది కంప్యూటర్లు మరియు కెమెరాల సహాయంతో టిక్కెట్లను ధృవీకరించారు. ప్రయాణీకులను ఆటోమేటెడ్ థర్మల్ స్కానర్ గుండా వెళ్ళమని చెప్పారు.
విజయవాడకు చేరుకున్న ఇతర రైళ్లలో గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం మరియు సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే ఫలకనామ ఎక్స్ప్రెస్, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ ఉన్నాయి.