fbpx
Monday, December 23, 2024
HomeTelanganaహైదరాబాద్ ట్రాఫిక్‌లో ట్రాన్స్‌జెండర్ల కొత్త ప్రయాణం

హైదరాబాద్ ట్రాఫిక్‌లో ట్రాన్స్‌జెండర్ల కొత్త ప్రయాణం

transgenders-join-hyderabad-traffic-police

హైదరాబాద్: ట్రాఫిక్ వ్యవస్థలో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 39 మంది ట్రాన్స్‌జెండర్లు నగరంలోని వివిధ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద విధుల్లో చేరారు.

15 రోజుల పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వీరికి తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీ ఆనంద్ మద్దతు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ పైలెట్ పద్ధతిలో 6 నెలల పాటు అమలుకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సమాజంలో ఓ ప్రత్యేక స్థానం కల్పించేందుకు దోహదపడుతుందని అధికారులంటున్నారు.

“వారిపై వివక్ష లేకుండా వారికి సమాన అవకాశాలు కల్పించాలి,” అని ముఖ్యమంత్రి తెలిపారు.

హైదరాబాద్ లో ఈ ప్రయత్నం విజయవంతమైతే దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఇది ఒక స్ఫూర్తిదాయక మోడల్‌గా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ట్రాన్స్‌జెండర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించి అందరికీ ఆదర్శంగా నిలవాలని సీపీ ఆనంద్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular