టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘సినిమా చూపిస్త మావ’, ‘ధమాకా’ వంటి హిట్స్ తర్వాత, డైరెక్షన్‌తో పాటు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ‘నక్కిన నరేటివ్’ బ్యానర్ ప్రారంభించి, ‘చౌర్య పాఠం’ అనే తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తన సంపాదనను పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగించాలన్న త్రినాథరావు నిర్ణయాన్ని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. నిర్మాణంలో కూడా స్వయంగా క్రియేటివ్‌గా పాల్గొనడంతో సినిమాల స్థాయి పెరిగే అవకాశం ఉంది. కొత్త టాలెంట్‌కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
దర్శకుడిగా కూడా త్రినాథరావు మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ వంటి పెద్ద బ్యానర్లతో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిన్న బ్యానర్ల నుంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల దిశగా ఆయన ప్రయాణం ఆసక్తికరంగా మారింది.
త్రినాథరావు ప్రత్యేకత ఏమిటంటే, సింపుల్ కథలను కమర్షియల్ ట్రీట్‌మెంట్‌తో ప్రజెంటేషన్ చేయడం. ఇదే ఫార్ములాతో ఈసారి పెద్ద స్టార్స్‌తో కలిసి మరింత పెద్ద స్థాయిలో సినిమాలు చేయనున్నారని టాక్. కొత్త లైనప్‌పై ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి హైప్ ఏర్పడింది.