మూవీడెస్క్: సౌత్ సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇప్పటికీ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.
1999లో ‘జోడీ’ చిత్రంలో చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె, 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ, ఆమె ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించింది.
తాజాగా ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలు ఆమెకు మళ్ళీ క్రేజ్ తెచ్చాయి. ఈ విజయంతో త్రిషకు అవకాశాలు క్యూకట్టాయి.
తాజాగా విజయ్ సరసన ‘లియో’ మూవీలో నటించి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అజిత్‌తో రెండు సినిమాలు – ‘విదాముయార్చి’ సంక్రాంతి రిలీజ్‌కి రెడీగా ఉండగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా షూటింగ్ దశలో ఉంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘విశ్వంభర’, మలయాళంలో మోహన్‌లాల్‌తో చేసిన ‘రామ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇంకా కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, సూర్యతో ‘సూర్య 45’ మూవీస్‌లోనూ కీలక పాత్రల్లో కనిపించనుంది.
మొత్తం మీద ఈ ఏడాది ఆమె చేతిలో ఏకంగా ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో చాలా బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం.
41 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె ఒక్కో సినిమాకు రూ. 1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటోంది. స్టార్ హీరోలతో నటించే ఫస్ట్ ఛాయిస్‌గా ఆమె కొనసాగుతోంది.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే, ఆమె ఇమేజ్ ఇంకా పెరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.