హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడులూ పెట్టే పరిశ్రమ రానుంది. యూఎస్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ సంస్థ అయిన ట్రైటాన్ – ఈవీ తెలంగాణ రాష్ట్రంలో తమ తయారీ యూనిట్ ను నెలక్పొలేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో జూన్ 24న దీనికి సంబంధించిన ఒప్పందం కూడా చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తో ట్రైటాన్ ఒప్పందం విజయవంతం కావడంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ మెదక్ జిల్లాలో ఉన్న జహీరాబాద్‌లో నెలకొన్న నిమ్జ్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ట్రైటాన్ సంస్థ స్థాపించబోతోంది. దీని కోసం ఇక్కడ రూ. 2,100 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఈ తయారీ యూనిట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆల్ట్రా మోడ్రన్ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా రూపుదిద్దుకుంటుందని ట్రైటాన్ సంస్థ ప్రకటించింది.
రాబోయే రోజుల్లో విద్యుత్ వాహనాలదే ఖచ్చితమైన భవిష్యత్తని ఇప్పటికే టెక్నో నిపుణులు చెబుతుండగా, ప్రభుత్వ విధానాలు సైతం అందుకు అనుగుణంగా కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యొక్క యూనిట్ తెలంగాణలో ఏర్పాటు అవనుంది.