మూవీడెస్క్: త్రివిక్రమ్ తో అల్లు అర్జున్! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తన షూటింగ్ పార్ట్ పూర్తిచేసిన బన్నీ, త్వరలో కొత్త ప్రాజెక్టులకు రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరోసారి పని చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
త్రివిక్రమ్, బన్నీ కాంబో గతంలో ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు, త్రివిక్రమ్ ఒక యూనిక్ జోనర్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బన్నీతో సినిమా చేయనున్నారని నిర్మాత నాగ వంశీ ఇటీవల వెల్లడించారు.
ఈ సినిమా పుష్ప లాంటి ప్రాజెక్టుల కంటే తక్కువ టైమ్ లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో పాటు వీఎఫ్ ఎక్స్ వర్క్ కూడా ముందుగా ప్లాన్ చేస్తున్నారు.
షూటింగ్ త్వరగా ముగిస్తే మరో దర్శకుడితో బన్నీ కొత్త సినిమా చేయడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చర్చ జరుగుతోంది.
ఈ వార్తతో త్రివిక్రమ్ – బన్నీ కాంబోపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.