కోలీవుడ్: అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ‘ముత్తయ్య మురళీధరన్’ కథ ఆధారంగా రూపొందుతున్న ఆయన బయోపిక్ ‘800 ‘ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో తమిళ్ టాప్ యాక్టర్ ‘విజయ్ సేతుపతి’ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన, మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి ఈ సినిమా పైన బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలంక లో తమిళులను వివక్ష తో చూస్తున్నారు అనే అంశాన్ని మురళీధరన్ కి ముడిపెడుతూ అలంటి సినిమాను విజయ్ సేతుపతి చేయకూడదు అనేది ఈ వివాదం యొక్క మూల అంశం అని చెప్పవచ్చు.
శ్రీలంక లో తమిళులని వివక్ష తో చూస్తున్నారు.. అలాంటివాడి బయోపిక్ నువ్వు తియ్యకూడదు అని చాలా మంది విజయ్ సేతుపతి ని విమర్శిస్తున్నారు. కోలీవుడ్ ఒకప్పటి ఫేమస్ డైరెక్టర్ ‘భారతి రాజా‘ కూడా ఈ విషయం లో విజయ్ సేతుపతి ని విమర్శించారు. ఇపుడే ఇలా ఉంది ఇంకా విడుదల సమయంలో చాలా వివాదాలు వస్తాయి అని వారించాడు. అలాగే కొందరు విజయ్ సేతుపతి ని సమర్ధించారు కూడా. ఒక ఆర్టిస్ట్ గా ఎలాటి కథనైనా చేయగలిగే స్వేచ్ఛ తనకి ఉందని విజయ్ ని సమర్ధించారు. అంతే కాకుండా మురళీధరన్ ‘హైదరాబాద్ సన్ రైజర్స్’ టీం కి కోచ్ గా ఉంటె తప్పులేదు కానీ ఈ సినిమా తీస్తే తప్పేంటి అని రాధికా శరత్ కుమార్ విజయ్ సేతుపతి ని సమర్ధించారు. ఇది ఇలాగే కొనసాగితే ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.