నిజామాబాద్: భారత దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదలి పెట్టడం లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. అయితే తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు.
కాగా,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ ఇటీవల కోవిడ్‌బారినపడి చికిత్స పొందుతున్నారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది. కరోనాతో మంగళవారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది.