fbpx
Sunday, September 8, 2024
HomeNationalఉత్తరప్రదేశ్ లో లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు

ఉత్తరప్రదేశ్ లో లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు

TRUCK-FELT-IN-VALLEY-IN-UTTARPRADESH

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక డీసీఎం (ట్రక్కు) లోయలోకి అదుపు తప్పి దూసుకెళ్లడంతో 11 మంది మరణించారు. ఇంకా ఈ ఘటనలో 40 మంది గాయాలపాలయ్యారు. ఘటాన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడి స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించారు.

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొంత మంది పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ఇటావా జిల్లా రవెనెలో చోటుచేసుకుంది. బద్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవెనె ప్రాంతంలో 50 మందికి పైగా ప్రయాణికులను తీసుకుని వెళ్తోంది. కాగా ఈ వాహనం సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి చక్కర్‌నగర్‌ రోడ్డులోని లోయ ప్రాంతంలో దూసుకెళ్లింది.

జరిగిన ఈ ఘోరమైన ప్రమాదంలో 11 మంది మృతి చెందారని అదనపు ఎస్పీ ప్రశాంత్‌కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. చనిపోయిన వారందరూ పురుషులేనని తెలుస్తోంది. తీవ్ర గాయాలైన వారు ఉండడం వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular