fbpx
Thursday, February 27, 2025
HomeInternationalట్రంప్ ప్రతిపాదనపై పుతిన్ స్పందన.. చైనా మాత్రం వ్యతిరేకం

ట్రంప్ ప్రతిపాదనపై పుతిన్ స్పందన.. చైనా మాత్రం వ్యతిరేకం

trump-defense-budget-proposal-putin-china-response

అంతర్జాతీయ స్థాయిలో రక్షణ వ్యయాలపై అమెరికా కీలక ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా రక్షణ ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఈ ఖర్చులను 50% తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనా దేశాలకు సూచించారు.

ఈ ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూలంగా స్పందించారు. రక్షణ వ్యయాన్ని తగ్గించేందుకు మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే, చైనా మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ అంశంపై పుతిన్ మాట్లాడుతూ, ‘అమెరికా 50% తగ్గిస్తే, మనం కూడా తగ్గిస్తాం. ఆపై చైనా కూడా అంగీకరిస్తే చర్చలు సులభమవుతాయి’ అన్నారు. అయితే, చైనా తన వైఖరిని మార్చే అవకాశం కనిపించడం లేదని తెలిపారు.

ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనతో అమెరికా-రష్యా మధ్య స్నేహం కొత్త దశలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో చైనా వైఖరి యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular