అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెన్మార్క్ ప్రధాన మంత్రి మెటె ఫ్రెడెరిక్సన్ మధ్య గ్రీన్‌లాండ్ కొనుగోలు అంశంపై ఇటీవల జరిగిన ఫోన్ కాల్ సంభాషణ తీవ్ర చర్చకు దారితీసింది.
45 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ట్రంప్ తన గ్రీన్‌లాండ్ కొనుగోలు ప్రతిపాదనను గట్టిగా వినిపించగా, డెన్మార్క్ ప్రధాని దాన్ని స్పష్టంగా తిరస్కరించారు.
గ్రీన్‌లాండ్‌ను విక్రయించడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఫ్రెడెరిక్సన్ స్పష్టం చేయడంతో, ట్రంప్ దూకుడుగా స్పందించి, సుంకాల ద్వారా డెన్మార్క్‌ను శిక్షిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఆకర్షణ కొత్తది కాదు.
2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ద్వీపం కొనుగోలుపై చర్చలు ప్రారంభించారు. గ్రీన్‌లాండ్‌లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో అమెరికా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది.
బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ ఖనిజాలకు భారీగా వినియోగం ఉన్నందున, గ్లోబల్ మార్కెట్‌లో గ్రీన్‌లాండ్ కీలక స్థానంలో ఉంది. అయితే, గ్రీన్‌లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన డెన్మార్క్ ప్రాంతమని, విక్రయానికి ఎప్పటికీ ఒప్పుకోబోమని డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది.