అంతర్జాతీయం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. యూకే మాజీ గూఢచారి క్రిస్టోఫర్ స్టీల్‌పై వేసిన దావా కేసులో ట్రంప్‌ను న్యాయస్థానం తప్పుబట్టింది.
ఆరోపణలు రుజువుకాలేకపోయినందుకు న్యాయ ఖర్చుల కింద ట్రంప్ రూ.6 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసు నేపథ్యం 2017లోకి వెళుతుంది. అప్పటి ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ ట్రంప్‌పై సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో ట్రంప్ రష్యా ఏజెంట్లతో సంబంధాల్లో ఉన్నారని, అధ్యక్ష ఎన్నికల ముందు ఐదేళ్ల పాటు రష్యా ఆయనకు సహాయం చేసిందని ఆరోపించారు.
2013లో ట్రంప్ చేసిన మాస్కో పర్యటనపైనా స్టీల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ట్రంప్, క్రిస్టోఫర్ స్టీల్‌ను లండన్ కోర్టులో లెగల్ నోటీసుతో ఇరికించే ప్రయత్నం చేశారు.
అయితే కోర్టు విచారణల్లో ట్రంప్ పక్షం నిరూపణకు అవసరమైన ఆధారాలు సమర్పించలేకపోయింది. దీంతో లండన్ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. అంతేకాదు, ట్రంప్ చేసిన ఈ లెగల్ యాక్షన్ వల్ల స్టీల్‌కు ఎదురైన నష్టాలను పరిహరించాల్సిందిగా ట్రంప్‌కు ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 7,41,000 డాలర్లు అంటే సుమారు రూ. 6 కోట్లు ట్రంప్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ తీర్పుతో ట్రంప్ మరోసారి అంతర్జాతీయంగా వివాదంలోకి వచ్చారు.