fbpx
Friday, December 27, 2024
HomeInternationalఇక ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేయాల్సిందే

ఇక ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేయాల్సిందే

TRUMP-TO-LEAVE-WHITEHOUSE-SOON

వాషింగ్టన్‌: ఎధ్యక్ష ఎన్నికల్లో ఓడి పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇక వైట్‌ హౌస్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు శామ్యూల్‌ అలిటో, క్లారెన్స్‌ థామస్‌లు శుక్రవారం కొట్టేశారు.

ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవన్నారు. సోమవారం సమావేశం కానున్న ఎలోక్టరల్‌ కాలేజీ బైడెన్‌ను ఎన్నుకుంటే ఇక ట్రంప్‌ వైట్‌హౌస్‌ను వీడాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ సుప్రీం కోర్టు తీర్పు దేశాన్నే ఇరుకున పెట్టేలా ఉందంటూ మండిపడ్డారు. ఇలాంటి తీర్పు ఇవ్వడం న్యాయాన్ని అవమానించడమే అని ట్వీట్‌ చేశారు.

అమెరికాలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇవ్వడంతో వ్యాక్సినేషన్‌ ఇక త్వరలో ప్రారంభం కానుంది.

కేవలం తొమ్మిది నెలల్లో సురక్షితమైన, సామర్థ్యమైన వ్యాక్సిన్‌ను రూపొందించాం అని డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక వీడియో సందేశంలో తెలిపారు. కరోనా మహమ్మారిని నిర్మూలించే రోజులు దగ్గర పడుతున్నాయన్న ట్రంప్‌ ఈ వ్యాక్సిన్‌ లక్షలాది మందికి ప్రాణం పోస్తుందని అన్నారు.

కాగా కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని, పూర్తి విశ్వాసంతో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా శాస్త్రవేత్తలు నాణ్యమైన టీకాను రూపొందించారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular