fbpx
Sunday, November 24, 2024
HomeTelanganaతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ళకే పదోన్నతి?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ళకే పదోన్నతి?

TS-EMPLOYEES-PROMOTION-PERIOD-2YEARS

హైదరాబాద్‌: తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతికి సర్వీసు కాలాన్ని 2 ఏళ్ళకే తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి పొందాలంటే ఆ ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి ఉండాలి అనే నిబంధన ఉంది.

కాబట్టి దీని ప్రకారం సదరు ఉద్యోగి మూడేళ్ల సర్వీసు పూర్తయిన తరువాతే పదోన్నతులకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సర్వీసు కాలాన్ని రెండు సంవత్సరాలకే తగ్గించే ప్రతి పాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్లో ఎంత మంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు, అందులో ఎంత మంది పదోన్న తులకు అర్హులవుతారో వివరాలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ వివరాలను పంపాలని ఇటీవల ఆ శాఖల హెచ్‌వోడీలకు లేఖ రాసింది.

అయితే పొరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈ విధానం అనుసరించాలని జీవో కూడా గత సంవత్సరమే విడుదల అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular