హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉద్యోగ నియామాకల ఊసే లేదు. గత కొన్ని రోజులుగా వేలల్లో ఉద్యోగాల నియామకానికి అమోదం తెలిపిన సర్కార్ తరువాత కార్యాచరనలో మాత్రం ముందడుగు వేయలేదు. ఒక వైపు కరోనా వైరస్ ఉధృతి మరో వైపు ఎన్నికల నేపథ్యంలో ఆ ఉద్యోగ నియామకాల గురించి ప్రస్తావన లేదు.
అయితె ఈ తరుణంలొ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బి. జనార్ధన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇంచార్జ్ పాలన కొనసాగుతోంది. కాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చైర్మెన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే బి. జనార్దన్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు సభ్యులను కూడా కమీషన్ లో నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రమావత్ ధన్‌సింగ్, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డి, ఆర్.సత్యనారాయణ, ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, సుమిత్ర ఆనంద్‌తో పాటు కారం రవీందర్‌రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఇక బి.జనార్దన్‌రెడ్డి గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావచ్చు అనే భావన మరియు ఆశ రాష్ట్రంలోని నిరుద్యోగులందరిలోను రేకెత్తుతోంది. అయితే ప్రభుత్వం ఈ నియామకాన్ని ఎంత వరకు ఉద్యోగల నోటిఫికేషన్ కోసం ఉపయోగిస్తుందో వేచి చూడాలి అంటున్నారు నిరుద్యోగులు.