తిరుమల: శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది.
వారానికి రెండుసార్లు ఈ సిఫార్సు లేఖలను అనుమతించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం త్వరలో అధికారిక ప్రకటన ద్వారా వెలువడే అవకాశముంది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ సాగింది.
ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్, మంత్రి కొండా సురేఖ వంటి ప్రముఖులు ఖండించారు. శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని వారు విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో, టీటీడీ బోర్డు ఈ విషయాన్ని పునఃపరిశీలించి, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం వల్ల తెలంగాణ భక్తులకు శ్రీవారి దర్శనంలో సౌలభ్యం కలగనుంది. దీంతో ఈ వివాదం సద్దుమణిగే అవకాశముంది.