తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుండి అతి భారీ మోస్తరులో కురుస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు తిరుమల నడక దారిలో వర్షపు నీరు భారీగా చేరి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 17, 18 వ తేదీల్లో తిరుమల రెండు నడక దారులను మూసి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
అందువల్ల వచ్చే రెండు రోజులపాటు తిరుమలకు వెళ్లే రెండు నడకదారులు (అలిపిరి, శ్రీవారిమెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని తెలిపింది టీటీడీ. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని’ టీటీడీ అధికారులు సూచించారు.