fbpx
Thursday, November 28, 2024
HomeAndhra Pradeshతిరుమల కల్తీ నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు

తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు

TTD -complaint- against- AR Dairy-Tirumala- adulterated- ghee- dispute (1)

తిరుమల: తిరుమల లడ్డూ నాణ్యత విషయంలో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీపై టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా కోసం ఏఆర్ డైరీకి మే 15వ తేదీన ఆర్డర్ ఇచ్చామని, జూన్ మరియు జూలై నెలలలో నాలుగు ట్యాంకర్ల ద్వారా నెయ్యి సప్లై చేసిందని తెలిపారు.

అయితే, భక్తుల నుంచి లడ్డూ నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ ఆధునిక టెస్టింగ్ విధానాలను ఉపయోగించి కల్తీ నెయ్యి పరీక్షలు చేయించింది. జూలైలో సరఫరా చేసిన నెయ్యి నందు వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ ఉందని ల్యాబ్ నివేదికలో తేలింది. దీనిపై జూలై 22, 23, 27 తేదీలలో ఏఆర్ డైరీకి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డైరీ టీటీడీకి ఎలాంటి కల్తీ చేయలేదని రిప్లై ఇచ్చింది.

అయితే, నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై కేసు నమోదు చేయాలని టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై ఇప్పుడు పోలీసు విచారణ ప్రారంభం కానుంది. ఇంతలో, ఏపీ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేస్తోంది. లడ్డూ వివాదం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular