అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించ బోతున్నారు. ఈ సందర్భంగా కేఎస్ జవహర్ రెడ్డి తాడేపల్లిలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాల గురించి వారు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లుకు నాకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం దక్కింది. వైద్యారోగ్య శాఖలో నూతనంగా ప్రవేశ పెడుతున్న నాడు-నేడు కార్యక్రమం దేశంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ మహత్తర కార్టక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది’ అని అన్నారు.
ప్రస్తుతం ఆయన వైద్య ఆర్గొయ శాఖ ముఖ్య కార్యదర్శి గా పని చేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ఆయన ఎంతో కీలకంగా పని చేశారు.