టాలీవుడ్: సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లు తెరచుకుని సినిమాలు విడుదల అవుతున్నా కూడా ఓటీటీ రిలీజ్ లు తగ్గలేదు. ఇప్పటి వరకు చిన్న సినిమాలే ఓటీటీ బాట పట్టినా కూడా మొదటి వేవ్ లో నాని నటించిన ‘V ‘ సినిమాలో ఓటీటీ లో విడుదలైంది. ఇపుడు నాని నటించిన మరో సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయింది. మొన్ననే నాని ఒక పోస్ట్ ద్వారా ఇది అనుకొని నిర్ణయం. కొన్ని నిర్ణయాలు మన చేతిలో ఉండవు , నా శాయ శక్తులా ప్రయత్నించాను కానీ కొన్ని అనుకున్నట్టు జరగవు అని ట్వీట్ చేసాడు.
ఈ మధ్యనే లవ్ స్టోరీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం, అదే రోజు టక్ జగదీశ్ ఓటీటీ లో విడుదల అవడం గురించిన క్లాషెస్ వచ్చాయి కానీ టక్ జగదీశ్ టీమ్ నుండి అధికారిక ప్రకటన ఐతే ఏదీ వెలువడలేదు. కానీ ఈ రోజు టక్ జగదీశ్ నిర్మాతలు ఒక అధికారిక ప్రకటన తెలిపారు. దాన్ని బేస్ చేసుకుని చూస్తే టక్ జగదీశ్ ఓటీటీ లోనే విడుదల అవనున్నట్టు అర్ధం అవుతుంది.
మజిలీ లాంటి అద్భుతమైన సినిమాని నిర్మించిన షైన్ క్రియేషన్స్ తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాలను నుండి టక్ జగదీశ్ సినిమాతో ట్రావెల్ చేస్తున్నారు. 2020 డిసెంబర్ లో పూర్తి అయినా సినిమా థియేటర్ ల కోసం ఎదురు చూసి ఏప్రిల్ 2021 లో విడుదల కోసం ప్లాన్ చేసింది కానీ సెకండ్ వేవ్ వలన అది కుదరలేదు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నాని ముందు ఒప్పుకోకపోయినా కానీ నిర్మాతల సమస్య దృష్ట్యా చివరకి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి తమ తరపున క్షమాపణలు తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో టాక్ జగదీశ్ ఓటీటీ విడుదల తేదీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.