fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsతుంబాడ్ రీ రిలీజ్‌కి అద్భుత స్పందన

తుంబాడ్ రీ రిలీజ్‌కి అద్భుత స్పందన

TUMBBAD-RE-RELEASE-SUPERHIT
TUMBBAD-RE-RELEASE-SUPERHIT

మూవీడెస్క్: 6 ఏళ్ళ క్రితం హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ గా విడుదలైన తుంబాడ్ మరోసారి ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది.

ఈ చిత్రం సెప్టెంబర్ 13న హిందీ భాషలో రీ రిలీజ్ అవ్వగా, అనూహ్యమైన ఆదరణ పొందుతోంది.

మొదటిసారి విడుదలైనప్పుడు 12.30 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రీ రిలీజ్ లో రెట్టింపు కలెక్షన్లు దక్కించుకుంటోంది.

ఇప్పటివరకు 30 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ రావడంతో పాటు, దసరా సెలవుల సీజన్ తో కలిపి ఈ చిత్రం 50 కోట్లను క్రాస్ చేయవచ్చని తెలుస్తోంది.

ముఖ్యంగా నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఇప్పుడు హర్రర్, థ్రిల్లర్ జోనర్ మూవీస్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతుండటం విశేషం.

సోహమ్ షా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్స్ కూడా ఉన్నట్లు దర్శకుడు రాహి అనిల్ బార్వే తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular