fbpx
Monday, March 31, 2025
HomeSportsమన కోహ్లీ కాదు.. ఇతను టర్కీ కోహ్లీ!

మన కోహ్లీ కాదు.. ఇతను టర్కీ కోహ్లీ!

turkey-actor-virat-lookalike-trending

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తులు అప్పుడప్పుడూ సోషల మీడియాలో దర్శనమిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం నేరుగా టీవీ స్క్రీన్‌ మీద కోహ్లీ లుక్‌ కనిపించడంతో సోషల్ మీడియాలో మళ్లీ హంగామా మొదలైంది.

టర్కీకి చెందిన నటుడు కావిట్ సెటిన్ గునెర్ ఓ సీరీస్‌లో కనిపించిన లుక్‌ను చూసిన నెటిజన్లు, “ఇది కోహ్లీనే!” అంటూ ఊహించలేని స్థాయిలో వైరల్ చేసేస్తున్నారు.

ఈ హంగామా Reddit వేదికగా ప్రారంభమైంది. ఓ యూజర్ “అనుష్క భర్త టీవీ అరంగేట్రం చేశాడు” అంటూ కావిట్ లుక్‌ను పోస్ట్ చేయడంతో కామెంట్ల వర్షం పడింది. ముఖ్యంగా అతని గడ్డం, కళ్ళ తీరూ, జుట్టు శైలి… అన్నీ కోహ్లీని గుర్తు చేస్తున్నాయంటూ స్పందనలు వెల్లువెత్తాయి.

వాస్తవానికి ఇది ‘Dirilis: Ertugrul’ అనే తుర్కీ హిస్టారికల్ డ్రామాలోని సీన్. ఈ సీరీస్ ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ప్రేక్షకుల్లో విపరీతంగా ఫేమస్ అయింది. అందులో కావిట్‌ సెటిన్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన కోహ్లీ లుక్‌తో మళ్లీ క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలోకి వచ్చారు.

ఇలాంటి పోలికలు సెలబ్రిటీల ప్రభావాన్ని తెలియజేస్తుంటాయి. ఈ వైరల్ విషయంలో కోహ్లీ లేదా అనుష్క స్పందించకపోయినా, ఫ్యాన్స్ మాత్రం “ఇది మరిచిపోలేని మూమెంట్” అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular