మూవీడెస్క్: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన లావణ్య – మస్తాన్ సాయి కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.
లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి, ఖాజా అనే మరో యువకుడిని అరెస్ట్ చేశారు.
లావణ్య తనను మానసికంగా వేధించారంటూ ఫిర్యాదు చేయగా, విచారణలో అనేక కీలక ఆధారాలు బయటపడ్డాయి.
పోలీసుల ఆధీనంలో ఉన్న ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌లలో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు సమాచారం.
తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ, తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన వద్ద హార్డ్ డిస్క్ ఉందని తెలిసాక, దాన్ని దొంగిలించేందుకు మస్తాన్ సాయి కుటుంబసభ్యులు ప్రయత్నించారని ఆరోపించారు.
ఇంకా బెదిరింపులు ఎదుర్కొంటున్నానని, న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
మస్తాన్ సాయి గతంలో మరికొంతమందిని కూడా మోసం చేశాడనే ఆరోపణలు వస్తుండగా, ఈ కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల దర్యాప్తులో మరోమారు షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉండటంతో, అందరి దృష్టి ఈ కేసుపైనే ఉంది.