అబుదాబి: కోవిడ్ విజృంభన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం తో సహా 14 వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. జులై 21వ తేదీ వరకు ట్రావెల్ బ్యాన్ నిషేధం అమలులో ఉన్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ నిషేధ జాబితాలో ఉన్న దేశాలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు మరికొన్ని ఆఫ్రికన్ దేశాలు, ఇలా మొత్తం 14 దేశాల ప్యాసింజర్ విమానాలను ఈ నెల 21వ తేదీ వరకు అనుమతించబోమని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. అయితే అదే సమయంలో రవాణా విమానాలు, ఛార్టెర్ ఫ్లైట్స్‌కు మాత్రం మినహాయింపులు ఇస్తున్నట్లు పేర్కొంది.
ఇంకోవైపు ఆతిథ్య దేశాలు విధించే ఆరోగ్య నిభంధనలు పాటించాలని తమ దేశ పౌరులకు సూచించింది యూఏఈ. అదే సమయంలో వేరే దేశాల్లో వైరస్ బారినపడి కోలుకున్న తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా తిరిగి స్వదేశాలకు రావడానికి వెసులుబాటు కూడా కల్పించింది.