టాలీవుడ్: కరోనా తర్వాత మోస్ట్ సక్సెస్ రేట్ తో టాలీవుడ్ దూసుకువెళ్తుంది. ఇప్పటికిప్పుడు చాలా సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మంచి సక్సెస్ తో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇది ఎంత కాలమో తెలియదు కానీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అని సినిమాలు మాత్రం వాయిదా వేస్తున్నారు. అయితే ఈ రోజు ఉగాది సందర్భంగా మున్ముందు విడుదల అవ్వబోతున్న సినిమాలకి సంబందించిన స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసాయి ఆ సినిమా టీమ్స్.
ఈ వారం విడుడల అవ్వాల్సిన బ్యూటిఫుల్ మూవీ ‘లవ్ స్టోరీ‘ సినిమాకి సంబందించిన ఒక లవ్లీ పిక్ విడుదల చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియ చేసింది. ఈ నెల చివర్లో విడుదల అవనున్న విరాట పర్వం నుండి ఇంటి గడప దగ్గర ముగ్గు పెడుతున్న సాయి పల్లవి పోస్టర్ విడుదల చేసి పండగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక ఫామిలీ మూవీస్ అయిన నాని ‘టక్ జగదీశ్‘, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలు మొత్తం ఫామిలీ ఉన్న ఫొటోస్ తో పోస్టర్స్ విడుదల చేసారు. చిరంజీవి ఆచార్య నుండి రామ్ చరణ్, పూజ హెగ్డే కి సంబందించిన పోస్టర్ విడుదల చేసారు. వరుణ్ తేజ్ నటిస్తున్న ఘని సినిమా నుండి హీరోయిన్ తో ఉన్న ఒక పోస్టర్ విడుదల చేసారు.
ఇవే కాకుండా రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ నటిస్తున్న RRR నుండి ఒక సెలబ్రేషన్ పోస్టర్, మరో పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ నుండి ప్రభాస్ ఎదురుచూపుల్తో ఉన్న ఒక పోస్టర్ విడులా చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియచేసారు.ఇలా రాబోవు సినిమాలు అన్ని ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్స్ తో సందడి చేసాయి.