fbpx
Sunday, November 24, 2024
HomeInternationalయూకేలో లాక్‌డౌన్ నాలుగు దశల్లో ‌సడలింపు: బోరిస్ జాన్సన్

యూకేలో లాక్‌డౌన్ నాలుగు దశల్లో ‌సడలింపు: బోరిస్ జాన్సన్

UK-FOUR-PHASE-UNLOCK-ROADMAP-BY-BORIS

లండన్‌: కోవిడ్ స్ట్రెయిన్ కేసులు పెరగడం వల్ల యూకేలోని చాలా ప్రాంతాల్లో కొన్ని నెలల క్రితం యూకే ప్రభుత్వం కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం అక్కడ అమలవుతున్న కోవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను నాలుగు దశల్లో ఉపసమ్హరించేందుకు ఉద్దేశించిన ఒక రోడ్‌ మ్యాప్‌ను ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

ఒక వేళ కొత్త కరోనా పాఝిటివ్ కేసులు నియంత్రణలో ఉంటే, ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్‌ 21వ తేదీకి చాలా వరకు ఆంక్షలను కనీసం 5 వారాల వ్యవధితో సడలించేందుకు అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత ‘స్టే ఎట్‌ హోం’పిలుపును మార్చి 29వ తేదీ నుంచి ‘స్టే లోకల్‌’కు మారుస్తామని తెలిపారు. అవసరమైతే మళ్లీ కోవిడ్‌ ఆంక్షలను విధించే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు.

ఆంక్షలు ఎత్తి వేసే తొలి దశలో మార్చి 8వ తేదీ నుంచి అన్ని వయస్సుల విద్యార్థులకు స్కూళ్లు మరియు యూనివర్సిటీలు ప్రారంభం అవుతాయి. రెండో దశలో ఏప్రిల్‌ 12 నుంచి అత్యవసరం కాని దుకాణాలు, ఔట్‌డోర్‌ డైనింగ్, బీర్‌ గార్డెన్స్‌ తెరుచుకోవడనికి అనుమతి ఇస్తారు.

ఇక తదుపరి మూడో దశలో మే 17వ తేదీ నుంచి పబ్‌లు, సినిమా హాళ్లు, జిమ్‌లను తెరిచేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. చివరి నాలుగో దశలో జూన్‌ 21వ తేదీతో నైట్‌ క్లబ్బులు, ఉత్సవాలు, సమావేశాలు, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు సహా అన్ని ఆంక్షల ఎత్తివేస్తామని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రమాదం నుంచి బయటపడినట్లు గణాంకాలతో రుజువైతేనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమల్లోకి వస్తాయని బోరిస్ పార్లమెంట్లో‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular