న్యూయార్క్: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో తమ పాలనలో మహిళలు, యువత భాగస్వామ్యంతోనే సమగ్ర సుపరిపాలన సాధ్యమని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ యూనైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇవాళ స్పష్టం చేసింది. అఫ్ఘాన్‌ను స్వాధీన పరుచుకున్న దాదాపు మూడు వారాల తరువాత తాలిబన్లు తమ నూతన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రకటించింది.
తాలిబన్ల పరిపాలన విధానంలో యువత, మహిళలకు అవకాశం ఇవ్వకూడదనే తాలిబన్ల ఆలోచన తీరును యూనైటెడ్ నేషన్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే యువత, మహిళల భాగస్వామ్యం లేని పరిపాలన విధానం అర్థరహితమైనదని కూడా వ్యాక్యానించింది.
తాలిబన్లు తమ హింసా ప్రవృత్తిని మానుకోవాలని, దేశంలో శాంతి, సుస్థిర సౌభ్రాతత్వం అనేవి సమగ్ర పాలన పైనే ఆధారపడి ఉంటాయని యూఎన్‌ఏఎంఏ నొక్కి చెప్పింది. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత జీవన విధానం అనేవి అఫ్గాన్ ప్రజల ప్రాథమిక హక్కులని యూఎన్ గుర్తు చేసింది.
దేశంలో ఉన్న తిరుగుబాటుదారులు మరియు పాత్రికేయుల పట్ల తమ హింసా బావాన్ని చూపించకూడదంటూ హితవు పలికింది. ఆఫ్గానిస్తాన్ లోని బాలికలు, మహిళలకు అండగ ఉంటామని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు యూఎన్‌ఏఎంఏ ప్రకటించింది.