అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల్లో మొత్తం 659 మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల విషయం విదితమే. మొదటి దశలో 173, రెండో దశలో 169, మూడో దశలో 171, నాలుగో దశలో 146 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజు తో తొలి విడత ఉపసంహరణకు సమయం ముగిసింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం, కర్నూలు జిల్లాలో 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం, అనంతపురం జిల్లాలో 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం, కడప జిల్లాలో 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం
గుంటూరు జిల్లాలో 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం, పశ్చిమ గోదావరి జిల్లాలో 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం, శ్రీకాకుళం జిల్లాలో 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం, విశాఖ జిల్లాలో 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం, తూర్పు గోదావరి జిల్లాలో 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం, కృష్ణా జిల్లాలో 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం, ప్రకాశం జిల్లాలో 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం, నెల్లూరు జిల్లాలో 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం అయ్యాయి.