మూవీడెస్క్: ‘అ!’ చిత్రంతో టాలీవుడ్‌లో కొత్త తరహా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ, ‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్‌గా ఎదిగారు.
ఈ సినిమా 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సూపర్ హీరో కాన్సెప్ట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
అయితే, ఇప్పుడు ప్రశాంత్ వర్మకు వరుసగా ప్రాజెక్ట్‌ల విషయమై అడ్డంకులు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది.
‘హనుమాన్’ తర్వాత ‘జై హనుమాన్’ అనౌన్స్ చేసిన ప్రశాంత్, రిషబ్ శెట్టి హీరోగా చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు.
కానీ బడ్జెట్ పెరగడంతో, ప్రాజెక్ట్‌ను మొదట నిర్మించేందుకు ముందుకొచ్చిన ప్రైమ్ షో ఎంటర్టైన్‌మెంట్స్ తప్పుకుంది.
తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో ప్రకటించిన సూపర్ హీరో మూవీ కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా రద్దయింది.
అంతేకాక, నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే ప్రాజెక్ట్ కూడా ప్రశాంత్ వర్మ చేపట్టిన సంగతి తెలిసిందే.
సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రారంభించేందుకు ప్లాన్ చేసినా, అనూహ్యంగా వాయిదా పడింది.
బాలకృష్ణ ప్రకారం, మోక్షజ్ఞ ఆరోగ్యం కారణంగా ఆలస్యం జరిగినట్లు చెబుతున్నారు. కానీ, పరిశ్రమలో ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్‌తో ప్రశాంత్ వర్మపై ఒత్తిడి పెరిగినట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే రణవీర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం, ‘జై హనుమాన్’ పై సందిగ్ధం నెలకొనడం ప్రశాంత్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి, ఈ ప్రాజెక్ట్‌లు సవ్యంగా పూర్తవుతాయా లేదా అన్నది చూడాల్సిందే.