ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన దాడి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
ఈ దాడిలో మహమ్మద్ షరీఫుల్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా నిలిచాడు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించిన అతను, విజయ్ దాస్ అనే కొత్త పేరుతో ముంబైలో జీవనం సాగిస్తున్నాడు.
సైఫ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించడానికి షరీఫుల్ వినూత్న పద్ధతులను అనుసరించాడు.
జనవరి 16న సైఫ్ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన షరీఫుల్, పన్నెండో అంతస్తుకు పైపు పట్టుకుని చేరి, బాత్రూమ్ కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాడు.
కేర్ టేకర్ కేకలు విన్న సైఫ్ వెంటనే అక్కడికి చేరుకోగా, అతనిపై కత్తితో దాడి జరిగింది.
అయితే కుటుంబ సభ్యులు సహకారంతో షరీఫుల్‌ను గదిలో బంధించినప్పటికీ, అతను తప్పించుకున్నాడు.
ముంబై పోలీసులు ఈ కేసులో 600 సిసి టీవీ ఫుటేజీలు పరిశీలించి, షరీఫుల్‌ను పట్టుకున్నారు.
దాడి చేసిన రోజు పావ్ భాజీ సెంటర్‌లో యుపిఐ పేమెంట్ చేసిన ఆధారంతో అతని ఆచూకీ కనుగొన్నారు.
చివరికి ఠాణేలోని లేబర్ క్యాంప్ వద్ద అతనిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
తాజాగా, సైఫ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
ఈ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి రానున్నాయనేది స్పష్టమవుతోంది.
పోలీసులు దాడి నేపథ్యంలో అందిన సమాచారం ఆధారంగా మరింత లోతైన అన్వేషణకు సిద్ధమవుతున్నారు.