న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే కేంద్ర బడ్జెట్ లో అమరావతి కి నిధులు ప్రకటించారు. ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ. 15,000/- కోట్లను ప్రకటించింది.
అలాగే, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ప్రకటించింది. ఇదే నేపథ్యంలో పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా సహాయం చేస్తామంది.
దీనితో పాటు చెన్నై – వైజాగ్ కారిడర్ ను కూడా వేగంగా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారమన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు రాష్ట్రానికి పలు విభాగాల్లో నిధులను మరియు ప్రాధాన్యతను సాధించారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర మరియు ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి కింద నిధులు. హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడర్ అభివృద్ధి కి ప్రత్యేక నిధులు.