మూవీడెస్క్: అన్‌స్టాపబుల్ లో బాలయ్య , చిరంజీవి! టాలీవుడ్‌లో హీరోల మధ్య సఖ్యత గురించి ఎన్నో సందర్భాల్లో చూశాం.
ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ ల స్నేహం గురించి పలుమార్లు బయటపడిన దాఖలాలు ఉన్నాయి.
ఇటీవల బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనడం, మల్టీస్టారర్ చేయాలనే ఆహ్వానం అందించడం ఇందుకు ఉదాహరణ.
ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలో మరోసారి బాలయ్య చిరు పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించారు.
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్నారు.
బాలయ్య ఏర్పాటు చేసిన గేమ్ లో పాటల హుక్ స్టెప్స్‌ను రీ క్రియేట్ చేయడం ఒక్కో పాయింట్‌తో జరుగుతోంది.
అందులో భాగంగా “ఇంద్ర” సినిమాలోని “దాయి దాయి దామ్మ” పాటకు ఇద్దరూ సరిగ్గా చేయలేకపోయారు.
బాలయ్య వెంటనే, “ఈ పాయింట్ నా బ్రదర్ చిరంజీవికి ఇస్తున్నా” అని చెప్పడంతో స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.
అందులోనూ బాలయ్య మాటల్లో చిరు పట్ల ఉన్న గౌరవం, అభిమానానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
బాలయ్య ఉద్దేశం ఫ్యాన్స్‌కు ఎంతో నచ్చింది. ఈ తారల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరూ పరిశ్రమ కోసం ఎంత దగ్గరగా ఉన్నారో ఇది మరోసారి రుజువైంది.