fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఅధీరా వచ్చేస్తున్నాడు

అధీరా వచ్చేస్తున్నాడు

Unveiling BrutalityOf Sanjaydatt

శాండల్ వుడ్: కన్నడ సినిమా పరిశ్రమని KGF ముందు KGF తర్వాత అని చెప్పుకోవచ్చు. 2018 లో సైలెంట్ గా విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక కన్నడ సినీ పరిశ్రమలో తప్ప మిగతా అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ సినిమాలోని తారాగణం అంతా పరిచయం లేదు. అయిన కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. విజయం అంటే కేవలం క్రిటిక్స్ మార్కులు పొందడమే కాకుండా కలెక్షన్స్ కూడా బాగానే వచ్చేయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో 2018 లో వచ్చిన ఈ సినిమాకి కొనసాగింపుగా KGF పార్ట్ 2 ప్రస్తుతం సిద్ధం అవుతుంది. కరోనా సంక్షోభం లేకపోతే ఇంకో రెండు మూడు నెలల్లో ఈ సినిమా విడుదల అవ్వాల్సింది, కానీ షూటింగ్స్ ఆలస్యం అవడం వాళ్ళ, మళ్ళీ పరిస్థితులు ఎపుడు మెరుగవుతాయో తెలియకపోవడం వాళ్ళ సినిమా విడుదల తేదీలు కూడా అయోమయం అయ్యాయి.

యష్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా రెండవ భాగంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదివరకే అతని క్యారెక్టర్ పేరు అధీరా గా అనౌన్స్ చేసారు ఈ సినిమా టీం. జులై 29 న సంజయ్ దత్ పుట్టినరోజు ని పురస్కరించుకొని ఆరోజు అధీరా బ్రుటాలిటీ ఎలా ఉంటుందో చూపించబోతున్నాం అని ప్రకటించారు మేకర్స్. జులై 29 న బ్రుటాలిటీ ని ఆవిష్కరించబోతున్నట్టు ట్వీట్ చేసారు ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular